రామకృష్ణా మఠంలో కన్నుల పండువగా శారదామాత జన్మతిథి వేడుకలు

హైదరాబాద్: రామకృష్ణా మఠంలో శారదా మాత జన్మతిథి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం ఐదున్నరకు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ధ్యానం, సుప్రభాతం, మంగళారతి, భజనల తర్వాత ఆరున్నరకు దేవాలయ ప్రదక్షిణం, ఏడుంబావుకు విశేష పూజ నిర్వహించారు. లలిత సహస్రనామ పారాయణం, భజనల అనంతరం ఉదయం పదకొండుబావుకు హోమం నిర్వహించారు.

మధ్యాహ్నం 12 గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం, సందేశంపై స్వామీ జ్ఞానదానంద ప్రసంగించారు.

మధ్యాహ్నం రెండు గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి చలన చిత్ర ప్రదర్శన తర్వాత వివేకానంద ఆడిటోరియంలో కృష్ణ సింధూరీస్ సంకల్ప ఫైన్ ఆర్ట్స్ వారిచే శాస్త్రీయ సంగీత విభావరి కన్నుల పండువగా సాగింది.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శారదామాత జన్మతిథి వేడుకలను విజయవంతం చేశారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*