సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జీఎస్టీ ఝలక్

హైదరాబాద్: సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబుకు జీఎస్టీ కమిషనర్ ఝలక్ ఇచ్చారు. మహేశ్‌బాబు అకౌంట్లను స్థంభింప చేశారు. తొమ్మది సంవత్సరాలుగా సేవా పన్నులు కట్టడం లేదని ఆరోపిస్తూ యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉన్న ఆయన అకౌంట్ల నుంచి 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బకాయి పడిన 73 లక్షల రూపాయల్లో మిగతా మొత్తం రాబట్టుకునేందుకు మహేశ్ బాబుకు నోటీసులు పంపినట్లు జీఎస్టీ కమిషనర్ తెలిపారు.

మహేశ్ బాబు అనేక సినిమాల్లో నటించడమే కాక పలు సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సంపాదించిన మొత్తంపై సేవా పన్నులు కట్టలేదని ఆయనపై అభియోగం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*