టీడీపీలో చేరిన నటి దివ్యవాణి.. పుకార్లకు చెక్ చెప్పిన బాపు బొమ్మ

బాపు బొమ్మ దివ్యవాణి టీడీపీలో చేరారు. పెళ్లిపుస్తకం సినిమాతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టిన దివ్యవాణి సోమవారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆమెకు కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో చేరినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఇకపై తన సమయాన్ని పార్టీ కోసమే కేటాయిస్తానని తెలిపారు. నిజానికి దివ్యవాణి గతేడాది నవంబరులోనే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వస్తున్న పుకార్లకు తాజాగా ఆమె చెక్ పెట్టారు.

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త కూడా..
దివ్యవాణితోపాటు కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త దేవీ ప్రసాద్ కూడా టీడీపీలో చేరారు. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఐటీ అధికారిగా పనిచేసి రిటైరైన దేవీప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*