
హైదరాబాద్: సినీ నటుడు అలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరాలని, పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. డిసెంబర్ 28న ఎయిర్పోర్ట్లో ఇప్పటికే జగన్ను కలిసిన అలీ ఈ నెల 9న ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొననున్నారు.
గతంలో అలీ టీడీపీలో చురుగ్గా ఉన్నారు. 1998లో టీడీపీ తరపున నిర్మాత రామానాయుడు కోసం ప్రచారం చేశారు. అప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
మైనార్టీ ఓట్లు కీలకమైన తరుణంలో అలీ లాంటి ప్రముఖులు పార్టీలో చేరడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వాస్తవానికి అలీ జనసేనానికి కూడా బాగా క్లోజ్. అయినా కూడా అలీ వైసీపీని ఎంచుకున్నారు.
Be the first to comment