పుజారా సెంచరీ.. పరుగులు పెడుతున్న భారత్ స్కోరు

భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ పది పరుగుల వద్ద ఓపెనర్ లోకేశ్ రాహుల్ (9) వికెట్‌ను కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77), చతేశ్వర్ పుజారా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత నాథన్ లయాన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

మరోవైపు పుజారా జాగ్రత్తగా ఆడుతూ టెస్టుల్లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (23), అజింక్యా రహానే (18) వెంటవెంటనే అవుటైనా హనుమ విహారితో కలిసి పుజారా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. పుజారా 130, హనుమ విహారి 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*