ఏపీలో మారుతున్న రాజకీయం.. చంద్రబాబుతో సబ్బం హరి భేటీ

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలలో వాతావరణం వేడెక్కుతోంది. గత కొంతకాలంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా టీడీపీలో చేరికపై ఆసక్తితో ఉన్నట్టు చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. విశాఖపట్టణం ఎంపీ సీటు, లేదంటే విశాఖపట్టణం నార్త్ అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలని కోరినట్టు సమాచారం.

సబ్బం హరి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన సబ్బం హరి విభజనానంతరం రాజకీయాలకు దాదాపు దూరమయ్యారు. ఇటీవల మళ్లీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. సబ్బం హరి వైసీపీలో చేరబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతుండడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఆయన చంద్రబాబును కలవడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టేనని చెబుతున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*