ఉద్రిక్తంగా మారిన కేరళ బంద్.. ఒకరి మృతి

అయ్యప్ప ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశానికి నిరసనగా హిందూ సంస్థలతో కలిసి శబరిమల కర్మ సమితి నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచే బంద్ కొనసాగుతోంది. అయితే, ఆందోళనకారుల అల్లర్లతో బంద్ ఉద్రిక్తంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైన బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టైర్లను తగలబెట్టి రోడ్లపై వేశారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. త్రిశూర్‌లో ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. తిరువనంతపురం, కాలికట్‌, మలప్పురం తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు మిన్నంటాయి. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కేఎస్ ఆర్టీసీ కేరళకు సర్వీసులు నిలిపివేసింది. బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది. బుధవారం రాత్రి సీపీఎం-బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పండలం ప్రాంతానికి చెందిన చంద్రన్‌ ఉన్నితన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*