కేజీఎఫ్ సరికొత్త రికార్డు.. సినిమాపై స్పెషల్ వ్యూ

హీరో యశ్‌ సినిమా కేజీఎఫ్ కలెక్షన్ల పరంగా రికార్డులు బద్దలుకొడుతోంది. పాత రికార్డులను చెరిపేస్తోంది. దక్షిణ భారత సినీ రంగ సత్తాను దేశానికి, ప్రపంచానికి చాటి చేప్పే రేంజ్‌లో సినిమా దూసుకుపోతోంది. సినిమాపై స్పెషల్ వ్యూ చదవండి….

సినిమా అయిపోయినాకచేతుల్ని చూశా..మ‌ట్టి అయ్యింది!………………….కొన్ని క‌థ‌లు ఒక్క‌డికోస‌మే…

Posted by రాళ్ళపల్లి రాజావలి on Tuesday, January 1, 2019

My view on KGF movie

సినిమా అయిపోయినాక
చేతుల్ని చూశా..
మ‌ట్టి అయ్యింది!
………………….

కొన్ని క‌థ‌లు ఒక్క‌డికోస‌మే పుడ‌తాయి..
ఆకాశంలోంచి ఉల్క‌లు రాలిన‌ట్లు..
ర‌చ‌యిత క‌లంలోంచి ప‌డ‌తాయి..
కేజీఎఫ్ కూడా అలాంటి గొప్ప ఉల్కాపాత‌మే..
ప్రేక్ష‌కుల గుండెల్లో క‌ల్లోలాన్ని పోస్తుంది.
అలాగ‌ని ఈ క‌థ ఆకాశంలోంచి ఊడిప‌డ‌లేదు..
మ‌ట్టిలోనే..
క్వార్జ్ రాళ్ల‌మ‌ధ్యే..
కాదు కాదు రాళ్లలోంచే పుట్టింది.
కొలిమిలోంచి ఎగిరిప‌డే..
కర‌కు రాపిడి నిప్పుర‌వ్వ ‘కేజీఎఫ్‌’

ఓ ఆరుగంట‌ల క్రితం..
మిత్రుడు Kiran ఫోన్ చేసి..
ఇంకా కేజీఎఫ్ చూడ‌లేదా అన్నాడు..
బాహుబ‌లి యాడ‌పోవాల్నో అన్నాడు..
సిగ్గుతో..
కార్నివాల్‌లో ఏడు గంట‌ల‌కు వాలిపోయా.

క‌థ విన‌కుండా వెళ్లే నికార్సు ప్రేక్ష‌కుని కాబ‌ట్టి..
అదేంటో సినిమాహాలంతా భ‌లే క‌న‌ప‌డ‌తాది.
కేజీఎఫ్ సినమా ప‌డింది..
అమ్మప్రేమ‌…
నాన్న‌లేని పిల్ల‌గాడు..
లోకాన్ని ఎలా చూస్తాడనే సినిమాటిక్‌గానే క‌థ క‌నిపించింది..
అమ్మ‌ప్రేమ పిండేసింది.
రాఖీ..
ఒక్కో డాన్‌ని చంపుతా వ‌చ్చాంటే..
మమమాస్ సినిమా అని జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారా ? అనిపించింది..
కొంచెం లోప‌ల‌కి పోతానే..
ప‌వ‌ర్‌కోసం రాటుదేలిన మొన‌గాడిలా నాయకుడు క‌నిపించాడు.
ప్ర‌పంచాన్ని న‌డిపే ప‌వ‌ర్‌..
ఆ ప‌వ‌ర్‌ని ద‌క్కించుకోవ‌టానికి పోరాడే యోధుడిలా కానొచ్చాడు.
నా సామిరంగ‌..
గ‌రుడ‌లాంటి రావ‌ణాసురుడిని చంప‌టానికి..
పుట్టిన రాముడిలాగా వొప్పినాడు ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి!

క‌థంతా కేజీఎఫ్ బంగారు గ‌ని చుట్టూ అల్లుకుంద‌ని..
ఆ త‌ర్వాత అర్థ‌మైంది.
మ‌నిషిని బానిస‌గా చేసిన రాక్ష‌సుడెప్పుడూ..
భూమిని తోడి ర‌క్త‌పుమ‌ట్టితో బ‌తికినోడెవ్వ‌డూ..
ఏ క‌థ‌లోనూ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డు..
ఈ సినిమా క‌థ మ‌నంద‌రికీ తెల్సిందే..
అసురుడిని సామాన్యుడు చంపడమే.

ఎంత అద్భుతంగా క‌థ చెప్పారో..
జ‌ర్న‌లిస్ట్‌గారు..
చ‌రిత్ర‌, వ‌ర్త‌మానం.
అమ్మ‌గురుతుల్ని తూకంగా వేస్తూ..
కథ చెప్తాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌.
కేజీఎఫ్‌లోకిపోయేప్పుడు..
రాముడు రావ‌ణున్ని చంప‌టానికి పోయిన‌ట్ల‌నిపించింది..
కానీ వానరుల్లేరు ప‌క్క‌న‌.
ఎవ‌రో క‌వి అన్న‌ట్లు..
“నెత్తురుంది.. స‌త్తువుంది..
ఆశ నీకు అస్ర్త‌మౌను..
శ్వాస‌నీకు శ‌స్త్ర‌మౌను,,
ఇంత‌కంటే సైన్య‌ముండునా.. “ గుర్తొచ్చాయి.

బంగారు గ‌నుల దారుల‌ను చూస్తుంటే..
అభిమ‌న్యుడు పోయిన‌ట్ల‌నిపించింది..
కానీ వీడు చ‌చ్చేర‌కం కాదు..
చంపేర‌కం క‌దా..
న‌వఅభిమ‌న్యుడు అన‌మాట‌.
కేజీఎఫ్‌లో ఎన్ని వ్య‌థ‌లు, ఎన్నిగాథ‌లు..
ఎంత బానిస‌త్వం..
“ఆఫ్రికాలో బానిస‌ల‌ను క‌ట్టేసేవారంట‌.. “
పుస్తకవాక్యం గురుతొచ్చింది.
ఆక‌లి కేక‌లు..
త‌లెత్తినా నరికేయ‌డాలు..
గీత దాటితే కాల్చేయ‌డాలు..
అక్క‌డో అమ్మ క‌థ‌…
బిడ్డ‌ను బ‌తికించేందుకు నాన్నగాథ‌..
పండుముస‌లోడి సాచ్చిగా..
కేజీఎఫ్ రావ‌ణ‌కాష్ట‌మే..
రాబందుల రాజ్య‌మే..
అదో గ‌రుడ పురాణ‌మే అనిపిస్తుంది.

ప్ర‌తి త‌ల్లీ ఓ యోధురాలే..
అంటాడు క‌థానాయ‌కుడు.
ఈ సినిమాని న‌డిపించిన యోధుడు క‌థానాయ‌కుడైతే..
ఈ సినిమా ఆత్మ‌…
నిప్పుల తున‌క‌ల్ని కూడా న‌ల్ల‌క‌డ్డీతో క‌ట్టిన‌ట్లు..
ఓ అమ్మ..
బిడ్డ‌డి కోసం చెప్పేమాట‌లే…
కేజీఎఫ్‌కి జ‌వ‌జీవాలు.
పిచ్చోడి కథలూ..
డైలాగ్స్కి చప్పట్లు చాలవు.

రాజ‌మౌళి సినిమాలో మాదిరే..
ఈనాక్క చంపురా అని హీరోతో జ‌నాలు అంటే అది కేజీఎఫ్‌.
ఆ ప్రాంత‌మూ పుట్టింది..
అత‌నూ పుట్టాడు..
కేజీఎఫ్ ప్రాంతం..
య‌స్ కోస‌మే పుట్టిన‌ట్టుంది.
ఈ క‌న్న‌డ క‌థ కాక‌పుట్టించింది..
ద‌క్షిణానే ..
మ‌ళ్లీ ఇలాంటి గొప్ప‌క‌థ పుట్ట‌డం చూసి..
వొళ్లంతా గ‌గుర్పొడిచింది..
గుండెలో నిప్పుక‌ణిక‌లు రేగాయి..
తెలీని ఉద్వేగం క‌రెంటులా..
న‌రాల్లో పాస్ అయ్యింది.
చూస్తుండ‌గానే రాఖీ..
దండ‌నాయ‌కుడ్ని పెద్ద‌సుత్తిని భూమిపై రెండుసార్లు కొట్టి..
స‌రిచేసి మ‌రీ మ‌ట్టికి బ‌లిచ్చాడు..
రావ‌ణ‌కాష్టాన్ని కాల్చేశాడు..
రావ‌ణున్ని ఒక్క‌వేటుతో కూల్చాడు..
ఏళ్ల బానిస‌త్వంలో మ‌గ్గిన జ‌నాల‌కు..
ప్రాణ‌వాయువుల్ని పిడికిళ్ల‌తో పంచాడు.
క‌థ ఇప్పుడే స్టార్ట్ అని ఆ జ‌ర్న‌లిస్టు అంటాడు..
సినిమా అయిపోయింది..
కుర్చీలోంచి బాధ‌గా లేచాను..
చేతుల్ని చూశా..
మ‌ట్టి అయ్యింది.
నేను కేజీఎఫ్ గ‌నిలోప‌లికి
వెళ్లాను క‌దా!
దేహానికి తెలీని శాకం త‌గిలింది..
మ‌న‌సంతా ఒక‌టే క‌మురువాస‌న‌.
-రాళ్లపల్లి రాజావలి
1.1.2019

????????????????????????????????????
ఓ సామీ.. కేజీఎఫ్ సినిమా ద‌ర్శ‌కుడా..
నువ్వు ద‌మ్మున్న క‌థ‌ని..
దుమ్ముదుమ్ముగా తీశావ్‌.
ర‌చ‌యిత‌లారా.. టెక్నీషియ‌న్లారా..
న‌టులారా.. మీ అంద‌రికీ వేల వంద‌నాలు.
య‌స్‌..
మ‌ట్టింలోచి పుట్టిన కేజీఎఫ్‌..
క‌థ నీకోస‌మే పుట్టింది య‌ష్‌.
????????????????????????????????????

( ఈ క‌న్న‌డ ఉత్తుంగ త‌రంగం కొట్టిన ప‌డ‌మ‌రనుంచి ఎగిసి.. ద‌క్షిణాదిని చుట్టేసి.. ఉత్తరాదినీ ఊపేశాక‌.. చాలా ఆల‌స్యంగా సినిమా చూశా. వాస్త‌వానికి మొద‌ట‌నుంచీ క‌థ‌ని, రివ్యూల‌ను చ‌ద‌వ‌కుండా ఓపెన్‌మైండ్‌తో సిన్మాకు వెళ్ల‌టం నాకు అల‌వాటు. రివ్యూలంటే మ‌నం సినిమా తీయ‌గ‌లిగితే రాయాల‌ని టీవీ 9లో ఉన్న‌ప్పుడే అనుకున్నా. తిట్ట‌డం, ఒక్క‌మాట‌లో సినిమా భ‌విత‌ను అవ‌హేళ‌న చేయ‌టం అంటే వాళ్ల క్రూని అవ‌మానించ‌ట‌మ‌ని అభిప్రాయానికి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి రివ్యూలు కాదు.. మ‌న అనుభూతిని చెప్పాల‌నుకున్నా. ఒక్క‌మాట‌లో ఓ గొప్ప డార్క్ యాక్ష‌న్ స్టోరీ కేజీఎఫ్.. రెండు, మూడుసార్లు చూసినా త‌నివి తీర‌ని ఓ సామాన్యుడి క‌థ )

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*