రూ. 2 వేల నోటుపై కేంద్రం సంచలన నిర్ణయం.. నోట్ల ముద్రణ నిలిపివేత

రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోట్లపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2వేల నోట్ల వల్ల మనీలాండరింగ్ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం వాటి ముద్రణను నిలపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను ఆదేశించింది. ఫలితంగా ఆర్బీఐ నోట్ల ముద్రణను నిలిపివేసింది.

రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసినప్పటికీ నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిజానికి రూ.2 వేల నోట్లను రద్దు చేయబోతున్నారంటూ గతంలో పలుమార్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి కేంద్రం ఖండించింది. లోక్‌సభలోనూ ఈ విషయాన్న ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ప్రభుత్వం మాత్రం నోట్లను వెనక్కి తీసుకోబోమని, చలామణి ఆపివేసినా నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*