శశికళను పట్టేసిన మూడోకన్ను.. ఆలయ ప్రవేశం నిజమే

శ్రీలంకకు చెందిన 47 ఏళ్ల మహిళ శశికళ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడం నిజమేనని తేలింది. ఆమె గర్భగుడిలోనుంచి వస్తుండడం శ్రీకోవిల్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. మరికొందరితో కలిసి ఆమె గర్భగుడి నుంచి బయటకు వస్తుండడం స్పష్టంగా అందులో రికార్డైంది.

కేరళకు చెందిన ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వారి ప్రవేశానికి నిరసనగా హిందూ సంఘాలు కేరళ వ్యాప్తంగా బంద్ పాటించాయి. బంద్ కాస్త హింసాత్మకంగా మారింది. మహిళల ప్రవేశంపై కేరళ ఇంకా రగులుతుండగానే శ్రీలంక మహిళ శశికళ స్వామిని దర్శించుకున్నట్టు వార్తలు రావడంతో పరిస్థితులు మరోమారు ఉద్రిక్తంగా మారాయి.

తాను అయ్యప్పను దర్శించుకున్నట్టు వచ్చిన వార్తలను శుక్రవారం శశికళ ఖండించింది. తాను స్వామిని దర్శించుకోలేదని, 18 మెట్ల నుంచి తనను పోలీసులు వెనక్కి పంపారని పేర్కొంది. అయితే, ఆమె మాటల్లో వాస్తవం లేదని సీసీ టీవీ ఫుటీజీ ద్వారా తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*