బ్రేకింగ్ న్యూస్: జడ్జి ఐశ్వర్య హఠాన్మరణం…

గుంటూరు: నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య(25) కన్నుమూశారు. నరసరావుపేట కోర్టు ప్రాంగణంలోని కోర్టు బంగళాలోనే ఆమె నివసిస్తున్నారు. ఇంకా పెళ్ళి కాకపోవడంతో ఐశ్వర్య తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. నిన్న తన నివాసంలో ఆమె జారిపడినట్లు తెలిసింది. అస్వస్థతకు గురికావడంతో కోర్టుకు సెలవు పెట్టారని తెలిసింది.

ఈ ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో తన తల్లికి కాఫీ తయారు చేస్తుండగా ఐశ్వర్య ఒక్కసారి కుప్పకూలిపోయారు. అంబులెన్స్ ద్వారా హుటాహుటిన పట్టణంలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఐశ్వర్య చనిపోయారని వైద్యులు తెలిపారు.

ఐశ్వర్య మరణ వార్త తెలుసుకున్న న్యాయవాదులు కోర్టుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*