జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక మలుపు

హైదరాబాద్, అమరావతి: వైఎస్‌ఆర్‌‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించింది. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం ఎన్‌ఐఏకు అప్పగించింది. కేసు విచారణ జరుపుతున్న ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ తెలిపారు. ప్రభుత్వం తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు ఆలస్యమైతే ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు అవుతాయని వాదించారు. దీంతో విచారణను ఎన్‌ఐఏ‌కు అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై కత్తిదాడి జరిగింది. శ్రీనివాస్ అనే యువకుడు ఈ దాడి జరిపాడు. ఈ దాడిలో జగన్ గాయపడ్డారు. విశాఖలో ప్రాధమిక చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌లో చికిత్స పొందారు.

జగన్‌పై జరిగింది కోడి కత్తి దాడా లేక నారా కత్తి దాడా అనేది త్వరలోనే తేలుతుందని వైసీపీ నేతలంటున్నారు. నిజాలు త్వరలో వెల్లడౌతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

సంచలనం కోసమే శ్రీనివాస్ జగన్‌పై కత్తిదాడి జరిపాడని ఏపీ పోలీసులు తెలిపారు.

అటు జగన్ ఆస్తుల కేసు కూడా నేడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో న్యాయమూర్తి వెంకట రమణ ఏపీకి బదిలీ అయ్యారు. దీంతో  కేసును మళ్లీ మొదటి నుంచీ విచారించనున్నారు. జగన్ ఆస్తుల కేసులో ఏడేళ్లుగా విచారణ కొనసాగుతోంది. 11 ఛార్జిషీట్లలో 3 ఛార్జ్‌షీట్లపై రెండేళ్లుగా విచారణ కొనసాగుతోంది. మళ్లీ తాజాగా విచారణ జరపాలంటే మరింత జాప్యం జరుగుతుందని తెలిసింది. విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*