కేసీఆర్ సంచలన నిర్ణయం?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం చురుగ్గా పావులు కదుపుతున్న కేసీఆర్ అందుకోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తద్వారా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

నిజానికి లోక్‌సభ ఎన్నికల విషయంలో కేసీఆర్‌కు బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డు ఉంది. 2004లో తొలిసారి కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2006, 2008లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయ దుందుభి మోగించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు.

రెండు స్థానాల్లోనూ గెలిచిన కేసీఆర్ గజ్వేల్‌‌ను అట్టేపెట్టుకుని మెదక్ స్థానానికి రాజీనామా చేశారు. తాజాగా ఇప్పుడు మరోమారు లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 16 స్థానాలను సొంతం చేసుకోవడం ద్వారా తిరుగులేని శక్తిగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి.

గత ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చి ఆ స్థానంలో తాను నిలబడాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*