ఈ విజయంతో జీవితకాలం వెలిగిపోతా: పుజారా

సిడ్నీ: ఆస్ట్రేలియా సొంతగడ్డపై కంగారూలను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. 30 ఏళ్లుగా దక్కని అద్భుత విజయాన్ని కోహ్లీ సేన సాధించింది. 2-1తో టెస్ట్ సిరీస్‌‌ను నెగ్గింది. 4 టెస్ట్‌ల సిరీస్‌లో చివరి టెస్ట్ చివరి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగులతో డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీశాడు. కంగారూలు ఫాలో ఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులు చేసే సరికే వర్షం ప్రారంభమైంది. దీంతో చివరి రోజు ఆటను రద్దు చేశారు. సిరీస్ భారత్ వశమైంది.

ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో 7 విజయాలు సాధించిన ఘనత కోహ్లీ సేనకు దక్కింది.

సమష్టి కృషితో విజయం సాధించగలిగామని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. క్రికెట్‌లో టెస్ట్ క్రికెట్ బెస్ట్ అని కోహ్లీ చెప్పాడు. ఆటగాడు తన ఆటను మెరుగుపరుచుకోవడానికి టెస్ట్ క్రికెట్ ఉపయోగపడుతుందన్నాడు.

టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ సేనకు గౌతం గంభీర్ కంగ్రాట్స్ చెప్పాడు.

తాజా విజయంతో తాను జీవితకాలం వెలిగిపోతానంటూ ఛటేశ్వర్ పుజారా ట్వీట్ చేశాడు. తాజా టెస్ట్‌లో పుజరా 373 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 193 పరుగులు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియాకు భారత్ భారీ టార్గెట్ ఇవ్వగలిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*