లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబును వెల్లడించిన వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబు పాత్ర ఈయనేదే
హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది ప్రకటించేశారు. కొద్దిసేపటి క్రితం వర్మ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చంద్రబాబు పాత్రలో హీరో శ్రీ తేజ్ నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీ తేజ్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించి మెప్పించారు. ఇటు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతిగా యజ్ఞా శెట్టి నటిస్తున్నారు. యజ్ఞా శెట్టి గతంలో కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో నటించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ పాత్రలో నటించారు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుంచీ ఏం జరిగిందనేది తన సినిమాలో చూపిస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*