పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.. ప్రకంపనలు షురూ!

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తనపై కొంత కాలంగా వస్తున్న దుష్ప్రచారంపై ఆమె స్పందించారు. హీరో ప్రభాస్‌తో సంబంధం అంటగడుతూ ఐదారేళ్లుగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త అనిల్, వైసీపీ నేతలతో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె తనపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి శిక్షించాలని కోరారు. తాను జీవితంలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా హీరో ప్రభాస్‌ను కలవలేదన్నారు. ఒక్కసారి కూడా కలవని, మాట్లాడని వ్యక్తితో సంబంధం అంటగడుతూ దుష్ప్రచారం చేయడంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలుంటే చూపాలని కూడా సూచించారు.

తనను ప్రేమించే భర్త, పిల్లలున్నారని గుర్తు చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులందరినీ కలచివేసే విధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తనను, తన కుటుంబ సభ్యులను బాధపెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నవారిని వదిలిపెట్టేది లేదన్నారు. తన పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నవారి కుట్రను భగ్నం చేయాలని, దోషులను గుర్తించి శిక్షించాలని ఆమె కోరారు. తనపై దుష్ప్రచారం వెనుక అధికార టీడీపీ హస్తం ఉందని షర్మిల ఆరోపించారు. ఎన్నికల కోసమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను వచ్చి అవాస్తవాలను ఎత్తి చూపకపోతే జనం నిజమనుకునే అవకాశముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దోషుల్ని పట్టుకునేందుకే తాను పోలీసులను ఆశ్రయించానని షర్మిల చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*