వైఎస్ జగన్‌పై కేసీఆర్‌ సంచలన నిర్ణయం

హైదరాబాద్: వైసీపీ నేత వైఎస్ జగన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్‌తో మాట్లాడాలని కేసీఆర్ తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో చర్చలు జరపాలని సూచించారు. వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు చర్చలు జరపనున్నారు. కేసీఆర్ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

బీజేపీ, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో చర్చించారు. మాజీ పీఎం దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కూడా చర్చలు జరిపారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు యూపిఏకు మద్దతు పలికారు. కాంగ్రెస్‌కు అనుకూల పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*