
- హైదరాబాద్: వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అండగా నిలిచారు. షర్మిలపై సోషల్ మీడియాలో వస్తోన్న అసత్య ప్రచారంపై రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పరిస్ధితి ఎంత దయనీయంగా మారిందన్నారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషం కక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయని,ఈ పరిస్ధితిని అధిగమించడం కోసం, పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని రాములమ్మ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనా కూడా విజయశాంతి షర్మిలకు మద్దతివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Be the first to comment