కేసీఆర్ గారి ఆదేశాల మేరకే జగన్‌ గారితో భేటీ : కేటీఆర్

హైదరాబాద్: తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో మధ్యాహ్నం పన్నెండున్నరకు సమావేశం కాబోతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా వివరాలు వెల్లడించారు. యూపీయేతర, ఎన్డీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై జగన్‌తో చర్చలు జరపబోతున్నామన్నారు.

కేటీఆర్‌‌తో పాటు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు చర్చలు జరపుతారని టీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఇప్పటికే దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో చర్చించారు.

మాజీ పీఎం దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కూడా చర్చలు జరిపారు.

ఎన్డీయేకు మెజార్టీ మార్కు 272 తగ్గితే ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. ఎన్డీయేకు మెజార్టీ వచ్చినా కూడా రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి ఫెడరల్ ఫ్రంట్ మద్దతు తప్పనిసరి అవుతుంది. సరిగ్గా ఈ కారణంగానే కేసీఆర్ ఎన్డీయే, యూపీఏ ఫ్రంట్ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు యూపిఏ వైపు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండా ఏ ఫ్రంట్ కూడా అధికారంలోకి రాదంటోన్న చంద్రబాబు తాను రాహుల్‌కు మద్దతు ప్రకటించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎన్నికల సమయంలో వైసీపీ టీఆర్ఎస్‌కు వ్యూహాత్మక మద్దతునిచ్చింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*