రేడియో ‘చిన్నమ్మ’ ఇక లేరు.. శోకసంద్రంలో ఆకాశవాణి ఉద్యోగులు

హైదరాబాద్: నిన్నటి తరం రేడియో అభిమానులకు ‘చిన్నమ్మ’ ఎప్పటికీ గుర్తుంటారు. ‘పాడి-పంట’ కార్యక్రమంతో ఆబాలగోపాలన్ని అలరించిన నిర్మలా వసంత్‌ (72) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. రేడియోలో ఆమె చేసింది వ్యవసాయ కార్యక్రమమే అయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రేడియో చిన్నమ్మ’గా ప్రత్యేక అభిమానాన్ని, గుర్తింపును అందుకున్నారు. నిర్మలా వసంత్ మృతి విషయం తెలిసి ఆకాశవాణి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.

నిర్మల కుటుంబానిది అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని కడప. వసంత్‌ను వివాహం చేసుకున్నాక ఉద్యోగ రీత్యా ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమె భర్త వసంత్ నిజాం కాలేజీలో ఇంగ్లిష్ విభాగంలో డీన్‌గా పనిచేశారు. సంత్-నిర్మల దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*