
హైదరాబాద్: ఈ నెల 23 నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ అత్తాపూర్లోని రాంబాగ్ దేవాలయ మైదానంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ కేసరి పేరుతో వరుసగా రెండో ఏడాది ఈ పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు రాజు పహిల్వాన్ తెలిపారు. తొలిసారిగా మహిళల కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకూ పోటీలుంటాయన్నారు.
పురుషులకు 50, 57, 61, 65, 70, 74, 84, 92, 93, 125 కేజీల విభాగాల్లో, మహిళలకు 50 కేజీల నుంచి 65 కేజీల విభాగంలో పోటీలుంటాయి. బాల కేసరికి 52 కేజీలనుంచి 65 కేజీల వరకూ తలపడవచ్చు. టైటిల్ సీనియర్ వెయిట్ కోసం 82 కేజీల నుంచి 120 కేజీల వరకూ పోటీ ఉంటుంది.
రెస్లింగ్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం నాకౌట్ తరహాలో ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని పహిల్వాన్ రాజు తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9550441355 నెంబర్కు ఫోన్ చేయాలని నిర్వాహకులు తెలిపారు.
Be the first to comment