సిగ్గుందా నీకు.. విశాల్‌ను డబ్బుతో కొంటావా?: కాబోయే భార్య అనీషపై నెటిజన్ మండిపాటు

కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె ఆళ్ల అనీషా రెడ్డిని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఆనంద క్షణాలను అనీష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాలోవర్లతో పంచుకుంది. విషయం తెలిసిన ఆమె ఫాలోవర్లు అభినందనలు చెబుతూ కామెంట్లు చేశారు. అయితే, ఓ యువతి మాత్రం అనీషను తిడుతూ కామెంట్ చేసింది.

‘‘డబ్బుతో విశాల్‌ను కొనాలని చూస్తావా? నీకున్న డబ్బుతో ఎవరైనా ఓ ముష్టోడిని కొనుక్కో. మీ ఇద్దరి జోడి చాలా దరిద్రంగా ఉంటుంది. అసహ్యమేస్తోంది. నీ… ’’ అంటూ బూతులు తిట్టింది. ఆమె అంతగా బూతులు తిట్టినా అనీషా మాత్రం చాలా కూల్‌గా సమాధానం ఇచ్చింది.

‘‘నా డబ్బు చూసే విశాల్ నన్ను పెళ్లాడతున్నాడని అనుకుంటున్నావా? ఇదేనా విశాల్‌‌కు నువ్విచ్చే గౌరవం. నీ మాటలు చూస్తుంటే అతడిపై నీకెంత గౌరవం ఉందో అర్థం అవుతోంది. జీవితంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంపై కొంత నమ్మకం కూడా ఉంచండి. టేక్ కేర్’’ అంటూ కూల్‌గా సమాధానం ఇచ్చింది.

తనను ట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అనీషా రెడ్డి చాలా హుందాగా సమాధానం ఇవ్వడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, ఇలాంటి వారి చెత్తవాగుడును పట్టించుకోవద్దని సలహాలు ఇచ్చారు. అనీషా రెడ్డి రిప్లైతో ఆ యువతి మైండ్ బ్లాంక్ అయి ఉంటుందేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*