లక్ష్మీస్ ఎన్టీఆర్ పాత్రధారుల ఎంపికలో వర్మ ది బెస్ట్

హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్టీఆర్ పాత్రధారిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించారని, ఇప్పటికే 11లక్షల మంది తన వీడియో చూశారంటూ వర్మ ట్వీట్ చేశారు.

 

ట్విటర్ వేదికగా వర్మ ఎప్పటికప్పుడు టీడీపీ నేతలకు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. తన సినిమా ద్వారా ప్రకంపనలు రేగడం ఖాయమంటున్నారాయన.

వెన్నుపోటు కుట్ర పాటపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా.

సినిమాకు సంబంధించి వర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ నిజ జీవితంలో జరిగిన నిజాలు బయటపెడతానని ప్రకటించడం కలకలం రేపింది.

వర్మ ఇప్పటికే చంద్రబాబు పాత్రధారి శ్రీ తేజ్‌ను పరిచయం చేశారు. శ్రీ తేజ్ అచ్చుగుద్దినట్లు చంద్రబాబులా కుదిరారు.

లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తున్నారు. గతంలో యజ్ఞాశెట్టి వర్మ దర్శకత్వంలో వచ్చిన వీరప్పన్ సినిమాలో వీరప్పన్ భార్య పాత్రలో నటించారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగు పెట్టినప్పటినుంచి ఏం జరిగిందనేది తన సినిమాలో చూపిస్తానని వర్మ గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లే పాత్రధారులనూ ఎంపిక చేసుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ముందే మరెన్ని సంచలనాలు సృష్టిస్తోందనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*