
టాలీవుడ్ టాప్ హీరో వెంకటేశ్-తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కథ రెడీ అవుతోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. సంకాంత్రి పండుగ కోసం సొంతూరు రేలంగికి వెళ్లిన శ్రీకాంత్ అడ్డాల అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
వరుణ్ సందేశ్-శ్వేతబసు ప్రసాద్ జంటగా నటించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంకటేశ్-మహేశ్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అయితే, ‘బ్రహోత్సవం’ సినిమా అతడి కెరీర్‌ను దారుణంగా దెబ్బతీసింది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో అవకాశాలు కరువైన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్లో కమల్ హాసన్-వెంకటేశ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గాడి తప్పిన ఈ అతడి కెరీర్‌ను ఈ సినిమా తిరిగి పట్టాలపైకి ఎక్కిస్తుందేమో చూడాలి.
Be the first to comment