కేఏ పాల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌కు క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కన్వీనర్ జెరూసెలం మత్తయ్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రైస్తవ సమాజం పరువు తీయవద్దని సూచించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో మత్తయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అడ్డగోలు విమర్శలతో క్రైస్తవుల పరువు తీయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోసారి ఇలా ప్రవర్తిస్తే క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.ఉంటే రాజకీయాల్లో ఉండాలని, లేదంటే మతబోధకుడిగా ఉండాలని, అంతేకానీ రెండు పడవల్లో కాలు పెట్టొద్దని సూచించారు. ఇకపై రాజకీయాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొంటే బాగుండదన్నారు.

తమ హెచ్చరికలు కాదని పాల్గొంటే క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరణ వేటు వేస్తామన్నారు. ప్రధానులు, సీఎంలు, సెలబ్రిటీలు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు కలవడానికి కారణం దైవ శక్తేనని, దానిని దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*