వాస్తవికత, విశ్వసనీయత వల్లే సోషల్ మీడియాకు ఆదరణ

హైదరాబాద్‌: ఆడియో మరియు వీడియో రూపంలో వ్యాప్తి చెందుతున్న సమాచారమే నేటి మీడియాకు ప్రధాన వనరుగా మారిందని, వాస్తవికత, విశ్వసనీయతల మూలంగానే సోషల్ మీడియా సమాచారానికి ఆదరణ ఏర్పడుతుందని భారతి వెబ్ సీఈఓ మిలింద్ ఓక్ అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో విశ్వసంవాద కేంద్రం హైదరాబాద్‌లో నిర్వహించిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రధాన వక్తగా మిలింద్ ఓక్ పాల్గొన్నారు. భారత్ వ్యతిరేక శక్తులు ఇక్కడి సాంస్కృతిక విలువలను, చిహ్నాలను ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్న ప్రయత్నాన్ని అరికట్టడానికి సోషల్ మీడియాను సమాజానుకూలంగా ఉపయోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
సమాచార భారతి కన్వీనర్ ఆయుష్ నడింపల్లి మాట్లాడుతూ జాతీయవాద భావజాలం కలిగిన ఔత్సాహిక కార్యకర్తలను సోషల్ వేదికగా సామాజిక అంశాల్లో భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న కృషిని వివరించారు.

‘సోషల్ మీడియా ద్వారా భారతీయ సంస్కృతి మరియు చరిత్ర పట్ల అవగాహన’ అంశం మీద జరిగిన సమాలోచనలో భాగంగా మాట్లాడిన ప్రముఖ సోషల్ మీడియా కార్యకర్త పద్మ పిళ్ళై, చరిత్ర వక్రీకరణ వంటి సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవాలంటే అందరూ నిజమైన చరిత్ర పట్ల అవగాహనా కలిగి ఉండాలని, అప్పుడే ఈ విధమైన దాడులకు సరియైన ఆధారాలతో సహా ధీటైన సమాధానాలు ఇవ్వగలుగుతామని తెలిపారు.

మై ఇండ్ మీడియా సంస్థ సభ్యురాలు పద్మిని భావరాజు మాట్లాడుతూ.. మన సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన స్పష్టమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం సోషల్ మీడియాలోని యూజర్లు ఎంతో అతృతతో ఎదురుచూస్తూ ఉంటారని వివరించారు. ఈ లక్ష్యంతో తమ మై ఇండ్ మీడియా సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల కోసం చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలను గురించి వివరించారు.

ఐటీ నిపుణులు రత్నాకర్ సదస్యుల మాట్లాడుతూ.. ప్రాచీన దేవాలయాలు మరియు ఇతర చారిత్రక కట్టడాల సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికి చేరేవిధంగా ఎలా వివిధ రూపాల్లో ఎలా పోస్ట్ చేయవచ్చు అనే విషయంపై సలహాలు అందించారు.

‘సామాజిక అవగాహన కోసం సోషల్ మీడియా’ అంశం మీద జరిగిన రెండవ రౌండ్ సమాలోచనలో ఐటీ నిపుణులు ప్రభల రామ్మూర్తి మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలను కలిపేందుకు తాము బాలికల సంక్షేమం, రక్షణ పేరిట నిర్వహించిన కాంపెయిన్ ఎలా ఉపయోగపడిందో వివరించారు.

హైదరాబాద్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు ఆశిష్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా తాము చేసిన పోరాట ఫలితంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు ఎలా లాబీయింగ్ ఎలా వణికిపోయిందనేది వివరించారు.

అడ్వొకేట్ కరుణాసాగర్ ప్రసంగిస్తూ సామాజిక అంశాలపై అవగాహన కోసం సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమాచారం పరిశోధనాత్మకంగా, ఎలాంటి అసభ్యతకూ తావు లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ డేటా సైన్స్ నిపుణులు గౌరవ్ ప్రధాన్ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*