హెచ్‌ఎమ్‌డీఏ కమిషనర్‌‌పై సీఎం కేసీఆర్ కన్నెర్ర.. బదిలీ వేటు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ బీ.జనార్దన్ రెడ్డిపై కేసీఆర్ సర్కారు కన్నెర్ర చేసింది. విదేశీ పర్యటనలో ఉండగానే ఆయనను హెచ్‌ఎమ్‌డీఏ బాధ్యతలనుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ పర్యటన నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కొంతకాలంగా ఆయనకు ఏ పోస్టింగ్ కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం వెయిటింగ్‌లో పెట్టింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*