రామకృష్ణ మఠంలో అద్భుతమైన నాయకత్వ శిక్షణ

హైదరాబాద్ : భాగ్యనగరంలోని రామకృష్ణ మఠంలో నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువతను సమర్ధమైన నాయకత్వ లక్షణాలు గల వ్యక్తులుగా తీర్చి దిద్దుతున్నారు. స్వామీ వివేకానంద మాదిరిగా గొప్ప నాయకుడిగా మలిచేందుకు స్వామీజీ బోదమయానంద గారు హ్యూమన్ ఎక్స్‌లెన్స్ విభాగం ద్వారా కృషి చేస్తున్నారు. శిక్షణలో భాగంగా ఒక గొప్ప నాయకుడిగా మారేందుకు ఉండాల్సిన అంశాలు, పాటించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన దారులను చక్కగా వివరిస్తూ బోధన చేస్తారు. నిరంతరం పూర్తి ఆత్మ విశ్వాసంతో స్థిరంగా ఉండే వ్యక్తిగా మలిచేందుకు కావాల్సిన శిక్షణ, బోధన ఇక్కడ అందుతుంది. అందుకు తగిన విధంగా తర్ఫీదు ఇస్తారు.

 

ఈ శిక్షణా కార్యక్రమం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంటుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఐదు రోజుల పాటు ప్రతి రోజూ సాయింత్రం 6:20 నుంచి 7:30 వరకు శిక్షణ నడుస్తుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారెవరైనా ఈ శిక్షణలో పాల్గొనవచ్చు. ఇందుకు ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉటుంది. మరిన్ని వివరాలకు rkmuth.org వైబ్‌సైట్‌ను దర్శించండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు. 040-27627961, 9177232696.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*