నిరాహార దీక్ష చేపట్టిన అన్నాహజారే!

రాలేగావ్ సిద్ధి: అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలంటూ ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు.

2013 డిసెంబర్‌లో లోక్‌పాల్, లోకాయుక్త బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. 2014 జనవరి 1 తేదీన అమలులోకి వచ్చాయి. అయితే లోక్‌పాల్, లోకాయుక్తల నియామకాలు ఇప్పటి వరకూ జరగలేదు. దీంతో ఇంతకాలం ఎదురుచూసిన నిరసనగా చివరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, రాజకీయ పార్టీల్లో చైతన్యం తెచ్చేందుకు అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు.

తన పోరాటం ఏదో ఒక పార్టీకి వ్యతిరేకం కాదని హజారే ఈ సందర్భంగా చెప్పారు. దేశ ప్రగతి, పురోభివృద్ధి కోసమే తన పోరాటమన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*