జయరాం హత్య కేసులో పోలీసుల అదుపులో టీవీ యాంకర్

హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మెన్, కోస్టల్ బ్యాంక్ డైరక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి అసలు పేరు పులివర్తి మాధురి అలియాస్ శిఖా చౌదరి. తనకు జయరామ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు  శిఖా స్వయంగా చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో శిఖా సిస్టర్‌తో కూడా జయరామ్ రిలేషన్ పెంచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. మాధురి సిస్టర్‌కి జయరాం ఎంబీబీఎస్ మెడికల్ సీట్ ఇప్పించారు.

రెండో వివాహం చేసుకున్నాక కూడా శిఖా చౌదరి… రాకేష్ రెడ్డి‌తో కాంటాక్ట్ పెంచుకున్నారు. రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. రెండో భర్తకు విడాకులు ఇచ్చేసి రాకేష్ రెడ్డితో సహజీవనం ప్రారంభించారు. జయరాం విదేశాలకు వెళ్ళినపుడు కంపెనీల లావాదేవీలు రాకేష్ మరియ మాధురికి అప్పగించేవారని తెలిసింది. అమ్మాయిలకు, జల్సాలకు ఎక్కువ ఖర్చుచేస్తున్నాడంటూ జయరాం భార్య పద్మ శ్రీ చెక్ పవర్ తీసేసుకున్నారు.

చేతిలో డబ్బులు లేని కారణంగా రాకేష్ రెడ్డి ద్వారా జయరాం లోన్ ప్రయత్నం చేశారు. దీంతో రాకేష్ రెడ్డి ఫైనన్సర్ వద్ద 4.5 కోట్ల రూపాయల లోన్ ఇప్పించారు. తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం కావడంతో జయరాంతో శిఖ గోడవపడింది. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో హత్య చేయాలని ఫిక్స్ అయిన రాకేష్ రెడ్డి జయరామ్‌ను రమ్మని హోటల్‌కి పిలిచారు. అయితే జయరాం రాకపోవడంతో సీన్ లోకి ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్‌ను రంగంలోకి దింపారని తెలిసింది. హోటల్‌లో జయరాం, రాకేష్ రెడ్డి, టీవీ యాంకర్, శ్రీకాంత్‌లతో కలిసి సమావేశం అయ్యారని తెలిసింది.

జయరామ్ హత్య టైంలో శిఖ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వికారాబాద్‌కు లాంగ్ డ్రైవ్ వెళ్లారని సమాచారం. జయరామ్ చనిపోయాడని శిఖ తెలుసుకోగానే జూబ్లీహిల్స్ ఇంటికొచ్చి తన పేరుపై కొన్న 10 ఎకరాల భూమి పత్రాలు తీసుకెళ్లారని తెలిసింది. పోలీసుల అదుపులో ప్రస్తుతం రాకేష్ రెడ్డి, శ్రీకాంత్, శిఖ చౌదరి, ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్ ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*