రాకేశ్ పిడిగుద్దుల వల్లే జయరాం మృతి!.. వెలుగులోకి మరో కోణం…

హైదరాబాద్: వివాహేత‌ర సంబంధాలు, విచ్చ‌ల‌విడి స్నేహాల‌ కార‌ణంగానే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హ‌త్య‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన జయరాం హ‌త్య కేసులో అనేక కీల‌క విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్ధిక లావాదేవీల్లోని విభేదాల కార‌ణంగానే జ‌యరాం హత్య కాబ‌డినట్టు పోలీసులు తొలుత నిర్ధారించగా… ఈ కేసులో మ‌రో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కేసులో ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డి జ‌య‌రాం ను పిడిగుద్దులు గుద్ది చంపిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. జ‌య‌రాం మేన‌కోడలు శిఖా చౌద‌రి స్నేహితుడుగా భావిస్తున్న రాకేష్ రెడ్డి మొద‌ట జ‌య‌రాంకే స‌న్నిహితుడు. మెద‌క్‌లోని జ‌య‌రాం నిర్వ‌హిస్తున్న టెక్ట్రాన్ కంపెని గొడవ వ్యవహారంలో రాకేష్ రెడ్డి జయరామ్ కు పరిచయమ‌య్యాడు. ఆ వ్య‌వ‌హారంలో ఉద్యోగుల జీతభ‌త్యాల‌కై జ‌య‌రాంకు రాకేష్ రూ. 4.5కోట్లు అప్పుగా ఇచ్చాడు.

ఈ క్ర‌మంలోనే రాకేష్ రెడ్డికి జ‌య‌రాం మేన‌కోడలు శిఖా చౌద‌రి ప‌రిచ‌య‌మైంది. వీరి ప‌రిచ‌యం త్వ‌ర‌గానే ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ వ్య‌వ‌హారం న‌చ్చ‌ని జ‌య‌రాం.. త‌న మేన‌కోడ‌ల్ని వ‌దిలేయాల్సిందిగా రాకేష్‌ను హెచ్చరించాడు. అందుకు సరేనన్న రాకేష్.. త‌న‌కు ముందుగా అప్పుగా ఇచ్చిన రూ. 4.5 కోట్ల‌తో పాటు శిఖా చౌద‌రి కోసం ఖ‌ర్చుపెట్టిన మ‌రో కోటి రూపాయ‌లు కూడా తిరిగి చెల్లిస్తేనే శిఖాను వ‌దిలేస్తాన‌ని చెప్పాడు. మొద‌ట ఈ విష‌యానికి ఒప్పుకున్న జ‌య‌రాం డ‌బ్బులు తిరిగివ్వ‌క‌పోవ‌డంతో రాకేష్ అత‌నిపై కోపం పెంచుకుని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఇది న‌చ్చ‌ని శిఖా చౌద‌రి రాకేష్ ను వ‌దిలేసి శ్రీకాంత్ అనే మ‌రో వ్య‌క్తితో స్నేహం చేసింది.

అయితే రెండు ర‌కాలుగా మోస‌పోయిన రాకేష్ రెడ్డి గ‌త‌ నెల 31 న జ‌యరాంను అద‌ను చూసి కిడ్నాప్ చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ హోట‌ల్ రూమ్‌లో జ‌య‌రాంను నిర్భంధించి త‌న‌కు రావాల్సిన డ‌బ్బును ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేశాడు. అయితే అప్ప‌టిక‌ప్పుడు ఫోన్ ద్వారా త‌న స్నేహితుల వ‌ద్ద నుంచి రూ. 6 ల‌క్ష‌ల రూపాయలు తీసుకొని రాకేష్ రెడ్డి మ‌నుషులకిచ్చాడు. ఇవ్వాల్సిన 5.5 కోట్ల‌కు బ‌దులు కేవ‌లం రూ. 6 ల‌క్షలు ఇవ్వ‌డంతో కోపోద్రేకుడైన రాకేష్ జ‌య‌రాంపై పిడిగుద్దుల వ‌ర్షం కురిపించాడు. జ‌య‌రాం హార్ట్ పేషెంట్ కావ‌డంతో ఆ దెబ్బ‌ల‌కు తాళ‌లేక గుండెనొప్పితో మ‌ర‌ణించాడు.

త‌న వ‌ల్ల జ‌య‌రాం హ‌త్య జ‌రిగింద‌ని తెలుసుకొన్న రాకేష్ రెడ్డి ఆ హ‌త్య‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు 31 వ తేది రాత్రి తాగిన మ‌త్తులో జూబ్లీహిల్స్ నుంచి మృత‌దేహాన్ని తీసుకొని కారులో నందిగామ‌కు బ‌య‌ల్దేరాడు. మార్గమ‌ధ్యంలో నందిగామ సమీపంలో కీసర టోల్‌ప్లాజా వ‌ద్ద కారును పొలాల్లో వ‌దిలేసి తిరిగి బ‌స్సులో హైద‌రాబాద్‌కు వెళ్లాడు.

అయితే పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్ర‌కారం పోలీసులు జ‌య‌రాంను ఊపిరాడకుండా చేసి విషప్రయోగం జరిపినట్లు తెలిపారు. కుక్కలను చంపేందుకు ఇచ్చే మత్తు ఇంజక్షన్‌ను జ‌యరాంకు వాడిన‌ట్టు వైద్యులు ధ్రువీకరించార‌ని వెల్ల‌డించారు. ఈ హత్యకు శిఖా చౌదరి ప్రధాన కారణం కాదని భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*