బ్రేకింగ్ న్యూస్: నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి

హైదరాబాద్: నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఝాన్సీని ప్రేమిస్తున్న సూర్య వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లి సంపూర్ణ ఆరోపిస్తున్నారు. ఎవరితో మాట్లాడినా వేధించేవాడని, ప్రశ్నించేవాడని ఆరోపించారు. సూర్య వేధింపులు భరించలేకే తన కుమార్తె ఝాన్సీ ఉరేసుకుని చనిపోయిందని సంపూర్ణ చెప్పారు. సీరియల్స్‌లో నటించే ఓ అమ్మాయి ద్వారా సూర్య ఝాన్సీకి పరిచయం అయ్యాడని, సూర్యతో ఝాన్సీ ప్రేమలో పడిందనే విషయం తమకు తెలియదని సంపూర్ణ చెప్పారు.

మాటీవీలో ప్రసారం అయ్యే పవిత్రబంధంలో ఝాన్సీ నటిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సూర్య కృష్ణా జిల్లా వాసి. ఆత్మహత్య చేసుకునే ముందు ఝాన్సీ సూర్యతో వాట్సాప్ చాట్ చేసింది.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*