ఝాన్సీ ఆత్మహత్య కేసు: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే సూర్య అరెస్ట్

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్య కారణమనే ఆరోపణల నేపథ్యంలో సూర్యను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సమయంలో తిరుపతిలో ఉన్న సూర్యతేజ అలియాస్ నాని గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న వెంటనే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఝాన్సీ అతడికి ఎటువంటి పరిచయం ఉంది? వారిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బాబీ ,గిరి అనే సినిమా బ్రోకర్లతో ఝాన్సీ సన్నిహితంగా ఉండడం వల్లే తాను కొన్నాళ్లుగా ఝాన్సీని దూరం పెట్టానని సూర్య పోలీసులకు వివరించినట్లు సమాచారం.

బాబీ, గిరిని పలుమార్లు సూర్య హెచ్చరించినప్పటికి వారు ఆమెతో పరిచయాన్ని కొనసాగించారని, దీంతో విసిగిపోయి తానే వారికి దూరమయ్యాయని విచారణలో సూర్య వెల్లడించినట్లు సమాచారం. అయితే, సూర్య వేధింపులు తట్టుకోలేకే ఝూన్సీ కొన్నాళ్లుగా సీరియళ్లకు దూరంగా ఉంటోందని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం.

మరోవైపు ఝాన్సీ ఆత్మహత్య కు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఫోన్ లాక్ ఒపెన్ కాకపోవడంతో ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు.

సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా సూర్యను అరెస్టు చేయాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని పోలీసు పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*