హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్ఫూర్తిదాయకంగా నేషనల్ సెమినార్

సెలవే లేని సేవకా.. ఓ సైనికా..
పనిలో పరుగే తీరికా.. ఓ సైనికా..
ప్రాణం అంత తేలికా.. ఓ సైనికా..
పోరాటం నీకో వేడుకా.. ఓ సైనికా…

పస్తులు లెక్కపెట్టవే.. ఓ సైనికా..
పుస్తెలు లక్ష్యపెట్టవే.. ఓ సైనికా..
గస్తీ దుస్తుల సాక్షిగా.. ఓ సైనికా..
ప్రతి పూటా నీకో పుట్టుకే.. ఓ సైనికా..

నువ్వో మండే భాస్వరం.. ఓ సైనికా..
జ్వాలా గీతం నీ స్వరం.. ఓ సైనికా..
బతుకే వందేమాతరం.. ఓ సైనికా..
నీ వల్లే ఉన్నాం అందరం.. ఓ సైనికా..

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్ఫూర్తిదాయకంగా నేషనల్ సెమినార్

హైదరాబాద్: స్వామి వివేకానంద షికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ‘‘స్వామి వివేకానంద.. 21వ శతాబ్దంలో ఆయన ప్రభావం’’ అనే అంశంపై వివేకానంద ఆడిటోరియంలో ఈ సెమినార్ నిర్వహించారు. రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద మహరాజ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, కొచ్చికి చెందిన విద్యావేత్త విజయ్ మీనన్, చెన్నై రామకృష్ణ మఠానికి చెందిన స్వామి రఘునాయకానంద, హైదరాబాద్ మఠానికి చెందిన స్వామి బుద్ధిదానంద, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుమితా రాయ్ కూడా ప్రసంగించారు.

స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించిన ఆరు ఉపన్యాసాలను స్వామి గౌతమానంద వివరించారు.

స్వామి వివేకానంద షికాగో ప్రసంగ సమయంలో వచ్చిన స్పందన తరహాలో సెమినార్‌లో పాల్గొన్న ఆహుతులతో హైదరాబాద్ రామకృష్ణ మఠం అద్యక్షులు స్వామి జ్ఞానదానంద మూడు నిమిషాల పాటు చప్పట్లు కొట్టించారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సెమినార్‌కు పెద్ద సంఖ్యలో యువత హాజరుకావడంపై హర్షం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద కలలను సాకారం చేసేందుకు యువత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

కొచ్చికి చెందిన విద్యావేత్త విజయ్ మీనన్ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ ద్వారా ప్రచురితమౌతున్న రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సాహిత్యాన్ని చిన్నాపెద్దా అంతా చదవాలని సూచించారు. జీవితంలో గొప్ప మార్పు రావడానికి ఈ సాహిత్యం ఉపయోగపడుతుందని విజయ్ మీనన్ చెప్పారు.

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుమితా రాయ్ నేతృత్వంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్ధులు స్వామి వివేకానంద బోధనలు తమలో ఎలాంటి మార్పును తీసుకువచ్చాయో వివరించారు. అనంతరం మాట్లాడిన సుమితా రాయ్ స్వామి వివేకానంద జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ మానవాళికి ఎలా అంకితమయ్యారో వివరించారు.

చెన్నై రామకృష్ణ మఠానికి చెందిన స్వామి రఘునాయకానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద‌ బోధనలను పొగడటం కాదని, ఆచరణలో పెడితేనే సార్ధకత ఉంటుందని సూచించారు.

సెమినార్‌లో పాల్గొన్న వక్తలకు హైదరాబాద్ రామకృష్ణ మఠం తరపున వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద జ్ఞాపికలను, సాహిత్యాన్ని అందజేశారు.

సాయంత్రం ఐదున్నరకు మఠం క్యాంపస్‌లో గీతా దర్శన్ డిజిటల్ వర్షన్‌ను రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద మహరాజ్‌ చేతుల మీదుగా ప్రారంభింప చేశారు.

అనంతరం ‘ఆధునిక మానవాళికి రామకృష్ణ పరమహంస సందేశం’ అనే అంశంపై స్వామి గౌతమానంద ప్రసంగించారు. భజనల అనంతరం రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్వామి గౌతమానంద భక్తులను ఆశీర్వదించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనడంపై రామకృష్ణ మఠం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*