మ‌ద‌నప‌ల్లి అభ్య‌ర్ధి ఎంపికలో ఉత్కంఠ

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సీయం చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల్లో రేసు గుర్రాల‌కే టికెట్లు ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లి వంటి నియోజ‌క వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా టికెట్ ఎవ‌రికి దక్కుతుందో అనే ఉత్కంఠ‌తతో మ‌ద‌నప‌ల్లిలో టీడీపి పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం మదనపల్లి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య 20మందికి మించి పోయింది.

 

ఇందులో మాజీ ఎం.ఎల్.ఎలు, మాజీ ఎం.ఎల్.సి., పార్టీ సీనియర్ నేతలతో పాటు వివిధ వర్గాల నుంచి (మైనార్టీ, బి.సి.,తటస్థులు, మహిళ కోటా) టికెట్లు ఆశిస్తున్నారు..

 

టికెట్ రేసులో ఆశావహులు ఎక్కువ మంది ఉన్న‌ప్ప‌టికి సీయం చంద్ర‌బాబు మాత్రం త‌న స‌ర్వేల ద్వారా వ‌చ్చిన రిపోర్ట్స్ ను ఆధారం చేసుకునే సాధ్య‌మైనంత వ‌ర‌కు గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే ఈ సారి టికెట్ ఇవ్వ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇప్పటి వరకు మదనపల్లి టికెట్ రేసులో ఉన్న అభ్యర్థులతో పాటు మదనపల్లిలో కొంతకాలంగా ట్రాఫిక్ సి.ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు నాయుడు పేరు కూడ పార్టీ అధిష్టానం ఆస‌క్తిగా పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ప్ర‌స్తుత సి.ఐగా శ్రీనివాసులు నాయుడు మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మదనపల్లి పట్టణం నడిబొడ్డులోని కోమటివాని చెరువు స‌మ‌స్యను న‌గ‌ర ప్ర‌జ‌ల‌తో క‌ల‌సి ప‌రిష్క‌రించారు. చెరువు మరమ్మతు, ట్యాంక్ బండ్ రోడ్డు నిర్మాణం వంటి పనులతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలతో ఆయన పట్టణంలో అన్ని వర్గాలలో ప్రశంసలు అందుకొన్నారు. అన్నింటికి మించి వివాదర‌హితుడిగా ప్ర‌జాభిమానం చూర‌గొన్నారు .

 

ఈ నేపథ్యంలో ట్రాపిక్ సి.ఐ.శ్రీనివాసులు నాయుడుకు తటస్థుల కోటా కింద మదనపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపు అందుకొంది. అయితే శ్రీనివాసులు నాయుడు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత వరకు బలపర్చుతారో వేచి చూడాలి.

 

చివ‌ర‌కు మ‌ద‌న‌ప‌ల్లి టికెట్ రేసులో మిగిలింది ఐదుగురే!

ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పుటికి పార్టీ అధిష్టానం సరైన నాయకత్వాన్ని ఇన్నాళ్లు ప్రకటించక పోవడంతో పార్టీలో కొంత స్ధబ్దత నెలకొంది. అలాగే వైకాపా అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉండడంతో ఆయనను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నేతల కోసం అన్వేషణ మెుదలైంది.

 

పార్టీ కేడ‌ర్ మొగ్గు దొమ్మ‌లపాటి ర‌మేష్ లేదా రాందాస్ చౌదరిల‌లో ఒక‌రికి మ‌ద‌న ప‌ల్లి టెకెట్ ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక బీసి సామాజిక స‌మీక‌ర‌ణ‌లు తీసుకున్న‌ట్లు అయితే తంబళ్ల ప‌ల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈ సారి టికెట్ ఇవ్వ‌కుంటే.. చిత్తూరు జిల్లాలో బిసీ ప్రాతినిధ్యం త‌రుపున బోడేపాటి మ‌మత‌కి మ‌ద‌న‌ప‌ల్లి టీడీపి టెకెట్ ద‌క్కే అవ‌కాశం లేక పోలేదు. మొత్తం మీద మ‌ద‌న ప‌ల్లి నియోజ‌క వ‌ర్గ పార్టీ అభ్య‌ర్ధి ఎంపికలో సీయం చంద్ర‌బాబు ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*