కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ నగర్ సాయిబాబా మందిర వార్షికోత్సవాలు

హైదరాబాద్ సైదాబాద్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలోని సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు.

గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, అఖండ దీపారాధన, సాయి సత్సంగం, భజనలు నిర్వహించారు. 108 కలశాలతో క్షీరాభిషేకం, పన్నీరు తో అభిషేకం నిర్వహించారు. బాబా నిజరూప దర్శనంతో భక్తులు తరించారు. 26వ తేదీన మహాలక్ష్మి అమ్మవారి పూజ, అభిషేకం, హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*