నేపాల్‌లో ఘోర దుర్ఘటన.. హెలికాప్టర్ కూలి మంత్రి సహా ఏడుగురు దుర్మరణం

కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. తూర్పు నేపాల్‌లోని తాప్లేజంగ్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ విషయాన్ని నేపాల్ హోం శాఖ కార్యదర్శి ప్రేం కుమార్ రాయ్ ప్రకటించారు.హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మరణించి ఉంటారని పేర్కొన్నారు. ప్రమాదంలో పర్యాటక మంత్రి రబీంద్ర అధికారి, మరో ఆరుగురు మరణించారు.

స్థానిక మీడియా ప్రకారం ఈ హెలికాప్టర్ లో పౌర విమానయాన వ్యాపారి ఆంగ్ ఛిరింగ్ షేర్పా, యెతి అండ్ హిమాలయన్ ఎయిర్ లైన్స్ చీఫ్, యువరాజ్ దహల్, ప్రధానమంత్రి కేపీ ఓలి వ్యక్తిగత కార్యదర్శి, ముగ్గురు ప్రభుత్వాధికారులు పైలెట్ ప్రవాకర్ కేసీ ఉన్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది.

తొలుత ఈ హెలికాప్టర్ గల్లంతైనట్టు వార్తలు వచ్చాయి. నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం అండర్ సెక్రటరీ యువరాజ్ దహల్, ఎయిర్ డైనస్టీకి చెందిన ఆంగ్ ఛిరింగ్ షేర్పా కూడా హెలికాప్టర్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. దేశీయ విమానాశ్రయాన్ని పరిశీలించేందుకు మంత్రి, అధికారులు, మొత్తం బృందం బయల్దేరింది. మంగళవారం నేపాల్ కొండ ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాలలో భారీ హిమపాతం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*