పాకిస్థాన్‌లో టెన్షన్.. టెన్షన్.. విమానాశ్రయాలు మూసివేత

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఈ ఉదయం భారత్ కూల్చివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. తమ భూభాగంలోకి ప్రవేశించడం వల్లే విమానాన్ని కూల్చివేసినట్టు భారత్ స్పష్టంచేసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ లో టెన్షన్ నెలకొంది.

ఈ క్రమంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్టు పేర్కొంది. తమ గగనతలాన్ని కూడా మూసివేస్తున్నట్టు వెల్లడించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*