యుద్ధమంటూ మొదలైతే అది నా చేతుల్లో, మోదీ చేతుల్లోనో ఉండదు: ఇమ్రాన్

ఇస్లామాబాద్‌: పుల్వామా దాడి తర్వాత భారత్-పాక్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వాతావరణం భారత వాయుసేన దాడి తర్వాత మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ప్రజలను ఉద్దేశించి ఆద దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. యుద్ధమంటూ ఒక్కసారి మొదలైతే అది ఎక్కడికి దారి తీస్తుందో తనకు తెలియదని అన్నారు.

ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది తన చేతుల్లో గానీ, మోదీ చేతుల్లో గానీ ఉండదన్నారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని భారత్‌ను పలుమార్లు కోరినట్టు తెలిపారు. మా భూభాగంలోకి మీరొస్తే.. మీ భూభాగంలోకి మేమొచ్చామని నేటి దాడులను ప్రస్తావించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*