అణుయుద్ధానికే పాక్ మొగ్గు.. ఎన్‌సీఏ సమావేశానికి ఇమ్రాన్ ఆదేశం

న్యూఢిల్లీ: భారత వాయుసేన దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ యుద్ధం దిశగా అడుగులు వేస్తోంది. భారత్ దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీ(ఎన్సీఏ) సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరిచి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా, ఎన్సీఏనే సమావేశ పరచడం వెనక ఉన్న ఉద్దేశం అణ్వాయుధాల ఉపయోగమేనని తెలుస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించేది ఇదే కాబట్టి యుద్ధమంటూ జరిగితే వాటిని ఉపయోగించాలని పాక్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, పుల్వామా దాడి తర్వాత భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషీ ఆరోపించారు. కశ్మీర్‌లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. తమ భూభాగాన్ని రక్షించుకోవడంలో భాగంగానే భారత్ దాడులను తాము తిప్పికొడుతున్నట్టు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*