విచక్షణ మరిచిన పాక్.. బందీగా చిక్కిన భారత్ పైలట్‌పై ప్రతాపం

ఇస్లామాబాద్: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం నుంచి వరుసగా సాగుతున్న పరిణామాలు దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. ఈ నేపథ్యంలో తమకు దొరికిన భారత వాయసేన పైలట్‌‌పై పాక్ సైనికులు ప్రతాపం చూపిస్తున్నారు.

యుద్ధ నియమాలు పాటించాలన్న కనీస విచక్షణ కూడా కోల్పోయి భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌పై భౌతిక దాడికి దిగుతున్నారు. ఇష్టం వచ్చినట్టు చితకబాదుతున్నారు. యుద్ధ సమయంలో శత్రు దేశ సైనికుడు దొరికితే హింసించకూడదన్న జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ అభినందన్‌ను తీవ్రంగా హింసిస్తున్నారు. కాళ్లతో తంతూ, ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ పైశాచికత్వానికి పాల్పడుతున్నారు

చదవండి: పాక్ అదుపులో మన పైలట్.. పేరు అభినందన్ వర్ధమాన్?

బుధవారం పాక్ వైమానిక దళానికి చెందిన విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. వెంటనే అప్రమత్తమైన భారత వాయసేనకు చెందిన మిగ్-21 విమానాలు వాటిని వెంబడించాయి. ఈ క్రమంలో మిగ్-21కు ప్రమాదం సంభవించడంతో పైలెట్ అభినందన్ పారష్యూట్ సాయంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అంతలోనే పాక్ సైనికులు అతడిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అయితే, బందీగా ఉన్న శత్రుదేశ సైనికుడికి హాని తలపెట్టకూడదన్న విచక్షణ మర్చిపోయి దాడి చేస్తున్నారు.

కాగా, విక్రమ్ అభినందన్ స్వస్థలం కేరళ. అభినందన్ తండ్రి వర్థమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్. అభినందన్ విద్యాభ్యాసం తిరుప్పూర్ జిల్లాలో సాగింది. చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. అభినందన్ కుటుంబం ప్రస్తుతం పంజాబ్ లో నివసిస్తున్నట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*