ఏపీకి కేంద్రం పెద్ద శుభవార్త

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ కీలక ప్రకటన చేశారు. ఎల్లుండి విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు ఊపందుకున్నాయి.

 

విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన కేంద్రం

– కొత్త రైల్వేజోన్‌ పేరు సౌత్‌కోస్ట్ రైల్వేజోన్

– గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికను తీర్చిన కేంద్రం

షెడ్యూల్ 13లోని 8వ ఆర్టికల్ ప్రకారం సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు

*విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ గా నూతన రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్*

విశాఖ కేంద్రంగా నూతన జోన్ ఏర్పాటు చేయాలని వారం క్రితం మంత్రిని కోరిన ఏపీ బీజేపీ నేతలు

*సాధ్యాసాధ్యాలను పరిశీలించి టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని నూతన రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్*

మార్చి 1న విశాఖకు *ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందుగానే నూతన రైల్వే జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న కేంద్రం*

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*