అభినందన్‌ను విడుదల చేస్తాం: ఇమ్రాన్

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రకటించారు.

పాకిస్థాన్ విమానాన్ని కూల్చే క్రమంలో పీఓకేలో సేఫ్‌‌గా ల్యాండైన అభినందన్‌ను పాక్ బలగాలు చుట్టుముట్టాయి. అంతకుముందే పీఓకేలోని స్థానికులు, ఆ తర్వాత పాక్ సైనికులు అభినందన్‌ను తీవ్రంగా గాయపరిచారు. శతృవులకు చేజిక్కినా అభినందన్ అధైర్యపడలేదు. తన వద్ద ఉన్న మ్యాపులను స్థానికంగా ఉన్న కాలువ నీళ్లలో పడేసి పనికిరాకుండా చేశారు. ఇతర ముఖ్యమైన కాగితాలను నమిలి మింగేశారు. పాక్ సైన్యాధికారులు వివరాలు అడిగినా అభినందన్ ఇవ్వడానికి నిరాకరించారు.

జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయకపోతే కఠిన చర్యలు తప్పవన్న భారత్ హెచ్చరికతో పాక్ దెబ్బకు దారిలోకి వచ్చింది. విడుదలకు అంగీకరించింది.

గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో పైలట్ నచికేతను అరెస్ట్ చేసిన పాక్ 8 రోజుల తర్వాత విడుదల చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*