వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ వీరిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పది రోజుల క్రితం నార్నె శ్రీనివాసరావు.. జగన్‌ను కలిశారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేడు ఆ వార్తలు నిజమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*