‘శివరాత్రి’ మహోత్సవాలకు చిన్న అనంతగిరి సిద్ధం

హైదరాబాద్: 44వ శివరాత్రి మహోత్సవాలకు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ఉన్న రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం సర్వం సిద్ధమైంది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఉత్సవాలు జరగనున్నట్టు నిర్వాహక కమిటీ ‘శ్రీ ప్రణవ భక్త సమాజం’ తెలిపింది.

ఆదివారం సుప్రభాత సేవతో ప్రారంభం కానున్న ఉత్సవాలు … మంగళవారం రాత్రి భజన కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ మేరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆలయ కమిటీ కోరుతోంది. ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.

ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న అనంతగిరి శివాలయ దర్శనం.. సాక్షాత్ రామేశ్వరం సందర్శనంతో సమానమని తెలుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*