బ్రేకింగ్ న్యూస్: మసూద్ అజహర్ చచ్చాడు

ఇస్లామాబాద్: జైష్ ఎ మహ్మద్ అధినేత మసూద్ అజహర్ చచ్చిపోయాడు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళాలు  గత నెల 26న జరిపిన దాడుల్లో చనిపోయినట్లు ప్రపంచ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పాకిస్థాన్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి ద్వారా 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న జైషే ఎ మహమ్మద్‌ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజారే.

నిజానికి మసూద్ పాకిస్థాన్‌ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడని, రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని, ప్రతిరోజు డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నాడని తొలుత వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌ రావల్పిండి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలిసింది.

 

మసూద్ మరణంతో భారత బలగాలకు అతి పెద్ద విజయం లభించినట్లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*