నటి రోహిణిపై స్టేజిపైనే విరుచుకుపడిన ఇళయరాజా

నటి రోహిణిపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేవారు. గత నెల 2న చెన్నైలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు శంకర్‌, నటుడు విక్రమ్‌ తదితరులు ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా ప్రసంగిస్తూ ప్రశంసించారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి రోహిణి.. శంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఇళయరాజాతో మీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు ఉంటుంది?’’ అని ప్రశ్నించింది.

రోహిణి ప్రశ్న విన్న ఇళయరాజా అందరి ఎదురుగానే రోహిణిని చెడామడా వాయించారు. రోహిణి తీరు తనకు నచ్చలేదంటూ ఆమె ముఖం మీదే చెప్పేశారు. అంతేకాదు, ‘‘నువ్వు నాకు అవకాశం ఇప్పించాలనుకుంటున్నావా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభికులు బిత్తరపోయారు. అయినా, ఇప్పుడు సినిమాల గురించి ప్రస్తావన ఎందుకని, శంకర్ తనకు ఎవరితో పనిచేయాలనిపిస్తే వారితో చేస్తారని, ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతావని ప్రశ్నించడంతో రోహిణి ముఖం వాడిపోయింది.

అయితే, తన ఉద్దేశం అది కాదంటూ ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదు. ఆ తర్వాత కాసేపటికి శంకర్ మాట్లాడుతూ.. ఇళయరాజా పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. జెంటిల్‌మెన్ సినిమా సమయంలో ఆయనను కలిసి సంగీతం అందించాల్సిందిగా అడగాలనుకుని అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు చెప్పాడు. నిజానికి ఆయనంటే తనకు భయం, గౌరవమని, అందుకనే ఆయనతో కలిసి పనిచేయలేకపోయానని శంకర్ వివరించాడు. అంతేతప్ప ఇంకేమీ లేదని చెప్పి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*