రెండో వన్డేలోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన కోహ్లీ సేన

నాగ్‌పూర్: రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులు చేయగా 251 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి ఓవర్‌లో చేతులెత్తేసింది. చివరి ఓవర్‌లో విజయ్ శంకర్ మ్యాజిక్‌తో భారత్ విజయతీరాలకు చేరింది. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా 11 పరుగులు చేయాల్సి ఉండగా విజయ్‌శంకర్ తొలుత స్టోయిన్స్‌ వికెట్ తీశాడు. ఆ తర్వాత జాంపాను కూడా అవుట్ చేసి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను గెలిపించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ముందుంది.

భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ డకౌట్ కాగా, శిఖర్ ధావన్ 21, విరాట్ కోహ్లీ 116, రాయుడు 18, విజయ్ శంకర్ 46, జాదవ్ 11, ధోనీ 0, జడేజా 21, కుల్దీప్ యాదవ్ 3, షమీ 2 పరుగులు చేశారు.

120 బంతుల్లో 10 ఫోర్లతో 116 పరుగులు చేసిన కోహ్లీ వన్డే క్రికెట్‌లో తన 40వ సెంచరీ నమోదు చేశాడు. అంతే కాదు కేవలం 159 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులను సాధించిన ఘనత కూడా కోహ్లీ సాధించాడు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, విజయ్ శంకర్ 2, బుమ్రా 2 వికెట్లు తీయగా జాదవ్, జడేజా చెరొక వికెట్ తీశారు.

ఈ నెల 8న రాంచీలో మూడో వన్డే జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*