సరిగ్గా ఇదే రోజున టెస్టు క్రికెట్‌లో అద్భుతం!

సరిగ్గా ఇదే రోజున టెస్టు క్రికెట్‌లో అద్భుతం!

టెస్టు క్రికెట్ చరిత్రలో 7 మార్చి, 1987న ఓ అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డులకెక్కింది సరిగ్గా ఈ రోజునే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో గవాస్కర్ ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేసిన ‘లిటిల్ మాస్టర్’ 58 పరుగుల వద్ద ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అప్పట్లో మీడియా ఇంత విస్తృతంగా లేదు కాబట్టి తర్వాతి రోజున పేపర్లు బయటకి వచ్చే వరకు గవాస్కర్ సాధించిన అద్భుతం ఎవరికీ తెలియకుండా పోయింది. 110 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పదివేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గవాస్కర్‌ అంటూ తాటికాయంత అక్షరాలతో పేపర్లు ఫస్ట్ పేజీలో ఈ వార్తను ప్రచురించాయి. గవాస్కర్ ఈ ఘనత సాధించిన తర్వాత ఇప్పటి వరకు మరో 12 మంది మాత్రమే టెస్టు క్రికెట్‌లో పదివేల పరుగుల మైలు రాయిని అందుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*