మహిళలకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త.. విమెన్స్ డే పేరుతో ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ విమెన్స్‌డే ఆఫర్లు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘విమెన్స్ డే సేల్’తో పలు ఆఫర్లు ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఈ సేల్ రేపటి వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు తదితర వాటిపై భారీ ఆఫర్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు నోకాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లు ప్రకటించింది.

చైనీస్ మొబైల్ మేకర్లు అయిన ఆసుస్, షియోమీ, ఆనర్ వంటి కంపెనీలతోపాటు దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్, అమెరికన్ కంపెనీ యాపిల్ వంటి కంపెనీల ఉత్పత్తులపైనా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. విమెన్స్ డే సేల్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్ సేల్‌ కూడా నిర్వహించనుంది.

విమెన్స్ డే సేల్‌లో భాగంగా జెన్‌ఫోన్ 5జడ్‌పై రూ.3 వేలు, జెన్‌ఫోన్ లైట్ ఎల్1పై రూ.1,000, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1పై రూ.500 రాయితీ ప్రకటించింది.

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ (4జీబీ ర్యామ్/64 జీబీ)ను రూ.10,999కే విక్రయానికి ఉంచింది. పోకో ఎఫ్1 (6జీబీ/64 జీబీ.. 6జీబీ/128 జీబీ)ను కొనుగోలు చేసే వారికి పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్‌పై అదనంగా రూ.2 వేల వరకు రాయితీ ఇస్తోంది. పోకో ఎఫ్ 1 (8 జీబీ ర్యామ్/ 256 జీబీ)ని కొనుగోలు చేసే వారికి ఎక్స్‌చేంజ్‌పై రూ.3 వేల వరకు రాయితీ ఇస్తోంది. ఇవేకాకుండా వివో వి11, ఒప్పో ఎఫ్9లపైనా రూ.3 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*